LIVE
AP Budget 2026-27: Record ₹3.2 lakh Cr allocation  •  PM Modi inaugurates Polavaram Phase 2  •  AP records highest-ever FDI inflow  •  Vizag Airport expansion gets ₹800 Cr  • 
AndhraPravasi
AndhraPravasi
ఆంధ్రప్రవాసి
⚡ BREAKING
AP Budget 2026-27: Record ₹3.2 lakh Cr allocation  •  PM Modi inaugurates Polavaram Phase 2  •  AP records highest-ever FDI inflow  •  Vizag Airport expansion gets ₹800 Cr  • 
Politics

Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!

Politics: అంతా 'గ్యాస్' అంటూ కాంగ్రెస్ నేత సెటైర్.. బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి..

admin 1 min read Updated 2026-04-25 08:10:31
Congress party: డ్రామాలు ఆపండి.. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాలు కేవలం నటనేనన్న కాంగ్రెస్ పార్టీ.!
Key Points
  • Politics: అంతా 'గ్యాస్' అంటూ కాంగ్రెస్ నేత సెటైర్..
  • బీఆర్ఎస్ కు టీఆర్ఎస్ తోకపార్టీ అన్న రామ్మోహన్ రెడ్డి..

Congress party: తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) ప్రకటన పెను దుమారం రేపుతోంది. పార్టీ ఆవిష్కరణ సభలో ఆమె తన తండ్రి కేసీఆర్‌ను 'మరమనిషి' అని సంబోధించడమే కాకుండా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను 'హిట్లర్ పాలన'తో పోల్చడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాలపై అధికార కాంగ్రెస్ పార్టీ ఘాటుగా స్పందించింది. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా కవిత కొత్త పార్టీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ కొత్త పార్టీ స్వతంత్రమైనది కాదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ ఆడుతున్న నాటకంలో ఇదొక భాగమని ఆయన కొట్టిపారేశారు.

కవిత స్థాపించిన పార్టీని కేవలం బీఆర్ఎస్ కు ఒక 'తోక పార్టీ'గా రామ్మోహన్ రెడ్డి అభివర్ణించారు. తండ్రి, తనయ మధ్య విభేదాలు కేవలం పైపైన కనిపిస్తున్నవే తప్ప, అంతర్గతంగా వారిద్దరూ ఒక్కటేనని ఆయన ఆరోపించారు. "బాపు నడిపే బీఆర్ఎస్ లో అంతర్భాగమే తనయ స్థాపించిన ఈ టీఆర్ఎస్" అని పేర్కొంటూ, తలా తోక ఎప్పుడూ విడిపోవని ఎద్దేవా చేశారు. కవిత తన ప్రసంగంలో తండ్రిపై చేసిన విమర్శలు కేవలం ప్రజల సానుభూతి పొందడానికేనని, ఇదంతా కేవలం 'గ్యాస్' అని ఆయన సెటైర్లు వేశారు. తండ్రి చాటు బిడ్డగానే కవిత రాజకీయ ప్రస్థానం సాగిందని, ఇప్పుడు హఠాత్తుగా కొత్త పార్టీ పేరుతో రావడం వెనుక రాజకీయ వ్యూహం దాగి ఉందన్నది కాంగ్రెస్ నాయకుల వాదన.

మరోవైపు, కవిత తన పార్టీ ద్వారా బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారన్న వార్తలు విన్పిస్తున్నాయి. అయితే, ఆమె చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ లేదా బీఆర్ఎస్ అగ్రనేతలు ఇంతవరకు అధికారికంగా స్పందించకపోవడం గమనార్హం. ఒకవైపు అధికార పార్టీ విమర్శలు, మరోవైపు సొంత కుటుంబంపై కవిత చేసిన ఆరోపణలతో తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ కొత్త పార్టీ ద్వారా కవిత భవిష్యత్తులో నిజంగానే స్వతంత్ర శక్తిగా ఎదుగుతారా లేదా అధికార పార్టీ అంటున్నట్లుగా అది బీఆర్ఎస్ వ్యూహంలో భాగమేనా అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది.

57 readers have reacted

More Coverage